FbTelugu

బండి సంజయ్ కు ప్రధాని మోదీ ఫోన్

హైదరాబాద్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఫోన్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, అభ్యర్థుల గెలుపు, టీఆర్ఎస్ కార్యకర్తల దాడులపై ప్రధాని అడిగి తెలుసుకున్నారు.
దాదాపు 10 నిమిషాల పాటు, ఎన్నికల సరళి పై పార్టీ పరిస్థితుల పై ముచ్చటించారు. బీజేపీ కార్యకర్తలు అధ్బుతంగా పనిచేశారని, టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాటం చేశారని అభినందించారు. నాయకులు, కార్యకర్తల పైన జరిగిన దౌర్జన్యం పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీని విజయ తీరాలకు చేర్చడానికి అన్ని విధాలా పోరాడిన తెలంగాణ శాఖ కార్యకర్తల పోరాట పటిమను కొనియాడారు.

నూతన ఉత్సాహంతో పార్టీ శ్రేణులు నడుచుకోవడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. దైర్యంగా ముందుకు సాగాలని అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని మోదీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు సూచించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.