FbTelugu

కరోనాతో ప్రధాని మృతి

బబానే: కరోనా వైరస్ దేశాధినేతలను పొట్టనబెట్టుకుంటున్నది. ఎస్వాటినీ (స్వాజిలాండ్) దేశ ప్రదాన మంత్రి ఆంబ్రోస్ మాండ్ వులో లామినీ (52) కరోనా సోకి చనిపోయారు.

వైరస్ సోకడంతో ఆయన దక్షిణాఫ్రికాలోని ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వైరస్ కారణంగా చనిపోయిన తొలి ప్రపంచ స్థాయి నాయకుడు ఆంబ్రోస్ కావడం గమనార్హం. 1968లో జన్మించిన ఆంబ్రోస్ 2018 లో ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. దేశ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన ప్రధానిగా ఆయన రికార్డులకెక్కారు. ప్రధాని మృతికి ప్రపంచ దేశాల అధినేతలు సంతాపం వ్యక్తం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.