FbTelugu

బోరున విలపించిన దేశాధినేత

రోమ్: ఆయన ప్రధాన మంత్రి. నిబ్బరంగా ఉండాలని చెప్పే ఆయనే బోరున విలపించాడు. కరోనా వైరస్ సోకిన వారిని కాపాడలేనంటూ చేతులెత్తి బోరున విలపించాడు.

ఆయనే ఇటలీ దేశం ప్రధాన మంత్రి చిసపే కాంటీ. ఆరు కోట్ల జనాభా కలిగిన ఇటలీ దేశం మరుభూమిగా మారింది. కరోనా వైరస్ సోకి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఒక్క శనివారం నాడే 793 మంది ప్రాణాలు విడిచారు. ఒకవైపు వైరస్ బారిన పడిన వారికి వైద్య సేవలు అందించలేక, మరోవైపు మరణించిన శవాలను పూడ్చేందుకు అయినవాళ్లు లేక నానా అవస్థలు పడుతున్నారు.

క్రిస్టియన్ మతాచారాల ప్రకారం మృతదేహాలను పూడ్చివేయాలి. కాని పూడ్చివేయడం మూలంగా మళ్లీ వైరస్ తిరగబడుతుందనే అనుమానాలు వ్యక్తం కావడం ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నది. పూడ్చడం కంటే సామూహిక దహనం చేయాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More