FbTelugu

తిరుమలలో ప్రధాన అర్చక పదవి గోవిందా

ఇక నుంచి నలుగురు ముఖ్య ప్రధాన అర్చకులు
తిరుమల: పదవీ విరమణ చేసిన ప్రధాన అర్చకులు ఏవి.రమణ దీక్షితులను పునర్నియామకం చేసిన తరువాత టిటిడిలో అర్చకులను సర్ధుబాటు చేశారు. ఇప్పటికే ప్రధాన అర్చకులు ఉండడంతో ఆ స్థానంలో నలుగురు ముఖ్య ప్రధాన అర్చకులను నియమించారు.

కేంద్ర ఎన్నికల కమిషన్ మాదిరి టిటిడి ఆలయంలో సమాంతర అర్చక వ్యవస్థను రూపొందించి ఆదేశాలు జారీ చేశారు. తిరుమలలో ఇకనుంచి నలుగురు ముఖ్య ప్రధాన అర్చకులు పనిచేయనున్నారు. కైంకర్యపర అర్చకులకు ఈ అవకాశం లేదని, వంశపార్యపర అర్చకులలోని నాలుగు కుటుంబాలకే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు టిటిడి స్పష్టం చేసింది. గొల్లపల్లి కుటుంబం నుంచి గోపినాథ్ దీక్షితులు, తిరుపతమ్మ నుంచి నారాయణ దీక్షితులు, పైడపల్లి నుంచి రాజేష్ దీక్షితులు, పెద్దింటి నుంచి రవిచంద్ర దీక్షితులను నియమిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తమను పునర్నియామకం చేయడంతో ఏవి.రమణ దీక్షితులు మంగళవారం నాడు తాడేపల్లి వెళ్లి సిఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపి, ఆశీర్వదించి వచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.