బెంగళూరు: వయస్సు మీద పడినా పూజారుల్లో కామోద్రేకాలు తగ్గడం లేదు. గుడుల్లో నీతులు బోధిస్తూ బయట మాత్రం రేప్ లు చేస్తున్నారు. ఇలాంటి ఘటనే కర్ణాటకలో జరిగింది.
స్విట్లు ఇస్తానంటూ పదేళ్ల బాలికను ఇంట్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. అత్యాచారం తరువాత గుక్కపెట్టి ఏడుస్తున్న బిడ్డను చూసి తల్లిదండ్రులు నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిక్ బళ్లాపూర్ కు చెందిన వెంకటరమణప్ప (68) పూజారిగా ఒక ఆలయంలో పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం అల్లుడు, బిడ్డ ఇంటికి వెళ్లాడు. వ్యక్తిగత పని నిమిత్తం ఆలయాన్ని మామకు అప్పచెప్పి అల్లుడు, కుమార్తె వేరే ఊరికి వెళ్లారు. సాయంత్రం పూట ఆలయం బయట ఆడుకుంటున్న పదేళ్ల బాలిపై వెంకటరమణప్ప కన్ను పడింది.
ఇంకేముంది ఆ బాలికను పిలిచి స్వీట్లు ఇస్తానని ఆలయ ప్రాంగణంలోకి తీసుకువెళ్లాడు. స్వీట్లు తినిపించి అత్యాచారం చేశాడు. ఎంతకూ పాప ఇంటికి రాకపోవడం తల్లిదండ్రులు ఆలయం బయట పూల వ్యాపారిని వాకబు చేశారు. పూజారి ఆలయంలోపలికి తీసుకువెళ్లాడని తెలపగా, అక్కడకి వెళ్లి చూడగా పాప ఏడుస్తోంది. ఏం జరిగిందని అడగ్గా, బలత్కారం చేశాడని చెప్పింది.
వెంటనే పాపను తీసుకుని పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని, అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టామని డిప్యూటీ కమిషనర్ సీకె.బాబా తెలిపారు.