FbTelugu

రైతుల ప్రతాపం… పంజాబ్ లో బీజేపీ ఓటమి

ఛండీగఢ్: పంజాబ్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఎదురు దెబ్బ తగిలింది. పట్టణ ఓటర్లు బీజేపీకి గట్టి షాక్ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ బావుటా ఎగురవేసింది.

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండున్నర నెలలుగా రైతులు ఢిల్లీలో దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. రైతుల డిమాండ్లకు కేంద్రం ససేమిరా అంటోంది. చర్చల పేరుతో పిలిచి కాలయాపన చేస్తున్నది తప్పితే పరిష్కరించడం లేదు. ఈ నేపథ్యంలో పంజాబ్ లో మోగా, కపుర్తాల, హోషియార్ పూర్, పఠాన్ కోట్, బటాలా, అబహర్, భటిండా మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగియి.
సాధారణంగా పట్టణ ఓటర్లు బీజేపీకే ఎక్కువ మొగ్గు చూపుతారు. కాని ఈసారి పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి గంపగుత్తగా ఓట్లేశారు. శిరోమణి అకాళీదళ్ తో కలసి బీజేపీ పోటీ చేస్తుండేది ఈసారి ఒంటరిగా పోటీ చేయడంతో బీజేపీతో పాటు అకాళీదళ్ పార్టీలు ఓటమి పాలయ్యాయి. మాజీ కేంద్ర మంత్రి, అకాళీదళ్ నాయకురాలు హర్ సిమ్రత్ బాదల్ ప్రాతినిధ్యం వహిస్తున్న లోకసభ నియోజకవర్గం పరిధిలోని భటిండా లో కాంగ్రెస్ జెండా ఎగురవేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.