FbTelugu

కరోనా ట్యాబ్లెట్ల ధరలు ఇవే…

ఢిల్లీ: ఫార్మా దిగ్గజం లూపిన్ యాంటి వైరల్ డ్రగ్ ఫివిపరవిర్ కు జెనరిక్ వర్షన్ ను కోవిహాల్ట్ పేరుతో ట్యాబ్లెట్లను అందుబాబులోకి తెచ్చిసింది. ఒక్కో ట్యాబ్లెట్ ధర రూ. 49 గా ఖరారు చేసింది.
కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనుక్కోవడానికి ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు, ట్రయల్స్ కొనసాగుతున్నాయి.

అయితే కరోనా బాధితులకు చికిత్సలో భాగంగా యాంటీ వైరల్ డ్రగ్ ఫివిపరవిర్ ను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి జెనరిక్ వర్షన్ ను ‘కోవిహాల్ట్’ పేరుతో అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ప్రకిటించింది. 200 ఎం.జీతో 10 ట్యాబ్లెట్లతో స్ట్రిప్స్ ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నామని తెలిపింది.
అదే విధంగా ఫావిపిరవిర్ కు జెనరిక్ వర్షన్ ను తీసుకొస్తున్నట్టు సన్ ఫార్మా కూడా ప్రకటించింది. ఒక్కో ట్యాబ్లెట్ ధర రూ. 35గా ఉంటుందని సన్ ఫార్మా తెలిపింది.

You might also like