FbTelugu

గతంలో ఆ జిల్లా కలెక్టర్ అరెస్టయ్యారు!

రాయ్ పూర్: మందుల కోసం బయటకు వచ్చిన వ్యక్తి ఫోను లాక్కుని నేలకొసి కొట్టి, చేయి చేసుకున్న దౌర్జన్యం చేసిన జిల్లా కలెక్టర్ పై చత్తీస్ గఢ్ ప్రభుత్వం వేటు వేసింది. ఈయన వార్తల్లో నిలవడం ఇది కొత్తేమి కాదని గతంలోనూ ఆయన దుందుడుకుగా ప్రవర్తించి అరెస్టు అయ్యారంటున్నారు.

లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించి బయటకు వచ్చావంటూ ఒక వ్యక్తి పై జిల్లా కలెక్టర్ రణబీర్ శర్మ చేయి చేసుకున్నాడు. మందులు తీసుకోవడానికి వెళ్తున్న వ్యక్తిని పోలీసులు అడ్డగించారు. మందుల చిట్టీ చూపిస్తున్న సమయంలో జిల్లా కలెక్టర్ ఆయన వద్దకు వచ్చారు. సెల్ ఫోన్ గుంజుకుని నేలపై విసిరి కొట్టి, చెంప చెల్లుమన్నాడు. ఆ తరువాత లాఠీఛార్జ్ చేయాలని పోలీసులను ఆదేశించాడు. ఈ గొడవను ఫోన్ లో రికార్డు చేసిన ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో రచ్చ రచ్చ అయ్యింది. ఈ వ్యవహారం సిఎం భూపేష్ బాఘెల్ దృష్టికి వెళ్లడంతో జిల్లా కలెక్టర్ పదవీ నుంచి తప్పించి, పోస్టింగ్ ఇవ్వకుండా సచివాలయానికి అటాచ్ చేశారు. గతంలో లంచం తీసుకున్న కేసులో రణబీర్ శర్మ అరెస్టు అయ్యారు కూడా. 2015 లో కాంకర్ జిల్లాలోని భాను ప్రతాప్ పూర్ సబ్ కలెక్టర్ గా పనిచేశారు. ఒక భూ వివాదం కేసులో గ్రామ రెవెన్యూ అధికారి నుంచి రూ.10వేలు తీసుకుని ఏసిబికి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఏసిబి కేసు నమోదు చేయడంతో పాటు అరెస్టు చేసింది. ఏసిబి నివేదిక ప్రకారం వెంటనే ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.