FbTelugu

ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి : అమిత్ షా

* బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్ మీట్

* గతంలో ఇచ్చిన హామీలనే కేసీఆర్ అమలు చేయలేదు

హైదరాబాద్: గ్రేటర్ లో బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇచ్చిచూడండి.. తామేంటో చేసిచూపిస్తామంటూ హోంమంత్రి అమిత్ షా అన్నారు. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయన నగరంలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ వంద రోజుల్లో అభివృద్ధి అనే నినాదంతో అధికారంలోకి వచ్చి 5 ఏండ్లు అయిందని, ప్రకటించిన హామీలేమైనాయని ప్రశ్నించారు. హైదరాబాద్ లో బీజేపీకి వస్తున్న ఆదరణ చూస్తుంటే మేయర్ పీఠం బీజేపీదే అని నమ్ముతున్నానని అన్నారు. వరదల్లో 7 లక్షల మంది జనం ఇబ్బందులు పడ్డారని ఆ సమయంలో సీఎం, ఓవైసీ ఎక్కడ పోయారని ప్రశ్నించారు. బీజేపీని గెలిపిస్తే నగరంలోని నాలాలపై అక్రమణ నిర్మాణాలను వెంటనే తొలగించి చూపిస్తామని హామీ ఇచ్చారు. తాము మాటిచ్చామంటే అమలు చేసి తీరుతామన్నారు. ఎంఐఎం కనుసన్నల్లోనే టీఆర్ఎస్ నడుస్తోందన్నారు. టీఆర్ఎస్ విధానాలతోనే పేదలకు పథకాలు అందడం లేదని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.