FbTelugu

నేడు తిరుమలకు రాష్ట్రపతి రాక

 అమరావతి: ఇవాళ భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరుమలలో పర్యటించనున్నారు. ఇవాల ఉదయం 10:30 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ఏపీ గవర్నర్ గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్, ఏపీ సీఎం జగన్ మోమన్ రెడ్డి రాష్ట్రపతికి స్వాగతం పలకనున్నారు.

రాష్ట్రపతి కోవింద్ తిరుచానూరు అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12:15 గంటలకు తిరుమల పద్మావతి గెస్ట్ హౌస్ చేరుకోనున్నారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఆపై పద్మావతి గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.