FbTelugu

రమణ ను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు

న్యూఢిల్లీ: సీనియర్ జడ్జి జస్టిస్ నూతలపాటి వెంకటరమణను సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిగా నియమిస్తూ భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు.

జస్టిస్ ఎన్.వి.రమణ ప్రధాన న్యాయమూర్తి పదవిలో 2021 ఏప్రిల్ 24 వతేదీ నుండి 2022 ఆగస్టు 26 వ తేదీవరకూ కొనసాగుతారని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అడ్వకేట్ గా ప్రాక్టిస్ ప్రారంభించిన రమణ అదనపు అడ్వకేట్ జనరల్ గా, ఆ తరువాత హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి పదోన్నతిపై ఢిల్లీ బదిలీ అయ్యారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు బదిలీ అయ్యారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ.బోబ్డే ఈ నెలాఖరున పదవీ విరమణ చేస్తుండడంతో ఆయన స్థానంలో రమణ పేరును ప్రతిపాదంచారు. ఏపీ సిఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి రమణ నియామకాన్ని అడ్డుకునేందుకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి, ప్రధాన మంత్రి, రాష్ట్రపతి కి లేఖలు రాసినప్పటికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బోబ్డే ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఆయన పేరునే సిఫారసు చేయడం, నియామకం చేయడం జరిగిపోయాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.