FbTelugu

రాష్ట్రపతి కాన్వాయ్… మహిళ మృతి

లక్నో: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కాన్వాయ్ కోసం అంబూలెన్స్ తో వాహనాలను నిలిపివేయడంతో ఒక మహిళ వాహనంలోనే ప్రాణాలు విడిచిన హృదయ విదారక ఘటన కన్పూర్ లో చోటు చేసుకున్నది.

అఖిల భారత పరిశ్రమల సమాఖ్య కాన్పూర్ చాప్టర్ మహిళా విభాగం అధ్యక్షురాలు వందనా మిశ్రా (50) ఇటీవల కరోనా పాజిటివ్ సోకింది. కోలుకుని ఇంటికి వచ్చిన తరువాత ఆమె మళ్లీ అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన కాకాదేవ్ లోని కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు బయలుదేరారు. వారి వాహనం ప్రయాణిస్తున్న గోవిందపూరి మార్గంలోని రాష్ట్రపతి కన్వాయ్ వెళ్తోంది. రాష్ట్రపతి కాన్వాయ్ కోసం ప్రజల వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ట్రాఫిక్ జామ్ లో వందన మిశ్రా వాహనం చిక్కుకున్నది. రాష్ట్రపతి కాన్వాయ్ వెళ్లిన తరువాత ట్రాఫిక్ ను వదిలారు. ఆసుపత్రికి వెళ్లేసరికి ఆమె చనిపోయింది. ఈ ఘటనపై మీడియాలో వార్తలు రావడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. విచారణకు ఆదేశించింది. ఘటనకు బాధ్యులైన ఒక సబ్ ఇన్ స్పెక్టర్ , ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు కాన్పూర్ అదనపు డిప్యూటీ కమిషనర్ అసిమ్ అరుణ్ తెలిపారు. వందనా మిశ్రా మృతిపై రాష్ట్రపతి విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి తరఫున పోలీసు కమిషనర్ ఆమె అంత్యక్రియలకు హాజరై కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.