FbTelugu

గెటవుట్ బోల్సోనారో!

బ్రెసిలియా: కరోనా వైరస్ అన్ని దేశాలకు ఒక దారి అయితే ఆయన దేశం మరో దారిలో పయనిస్తున్నది. అదే బ్రెజిల్ దేశం. ఆ దేశ అధ్యక్షుడు బొల్సోనారో విమర్శలకు కేంద్ర బిందువు అయ్యాడు.

తాజాగా ఆయన ఆగ్నేయ రాష్ట్రం ఎస్పిరిటో శాంటో లో పలు ప్రాజెక్టులను ప్రారంభించడానికి వెళ్లారు. అప్పుడే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న ఒక విమానంలోకి ఎక్కారు. అందులో ఉన్న ప్రయాణీకులకు హలో చెప్పాడు. ఒకరిద్దరు ఆయనతో సెల్ఫీలు దిగగా, వెనకాల ఉన్న ప్రయాణీకులు వేలును చూపుతూ ఒక్కసారిగా నినాదాలు చేశారు. గెటవుట్ బోల్సోనారో, జెనోసీడల్ ఉన్మాది అంటూ పెద్దపెట్టున అరిచారు. దీనిపై స్పందించిన ఆయన వెంటనే బయటకు వెళ్లండి అనే వారు గాడిదలపై ప్రయాణిస్తున్నట్లున్నారని నవ్వుతూ బదులిచ్చారు. కొద్ది నెలలుగా బోల్సోనారో పై దేశ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. కరోనా కేసులు పెరగడానికి, శవాల దేశంగా మారడానికి కారకుడని దుమ్మెత్తి పోస్తున్నారు. వైరస్ విజృంభిస్తున్నప్పటికీ ఫేస్ మాస్క్ లు, లాక్ డౌన్, వ్యాక్సిన్ లను ఆయన విమర్శించారు. ఇవేమి కాపాడవని పలు వేదికలపై చెప్పారు. ఇప్పటి వరకు బ్రెజిల్ లో కరోనా బారిన పడి 4.80 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా దేశం తరువాత అత్యధిక మరణాలు ఎక్కడ జరిగాయంటే బ్రెజిల్ పేరు చెబుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.