FbTelugu

యూపీలో రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి సంతాపం

న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ లోని ఔరాయ లో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో 23 మంది వలస కూలీల మృత్యువాత పడ్డారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తీవ్రం సంతాపం వ్యక్తం చేశారు.

ఈ ఘటన తనకు చాలా బాధ కలిగించిందని ట్విట్టర్ లో తెలిపారు. బాధిత ప్రజలకు సహాయం చేయడానికి స్థానిక అధికార యంత్రాంగం అవసరమైన అన్నిచర్యలూ తీసుకుంటోందని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

You might also like