FbTelugu

నేపాల్ పార్లమెంటు ను రద్దు చేసిన ప్రెసిడెంట్

కాట్మాండు: నేపాల్ దేశ అధ్యక్షురాలు విద్యాదేవీ భండారి పార్లమెంటు ను రద్దు చేశారు. నేపాల్ పార్లమెంటును రద్దు చేయడమే కాకుండా మధ్యంతర ఎన్నికలకు షెడ్యూలు కూడా ప్రకటించారు.

నేపాల్ లో నవంబర్ 12, 19 తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అంతకు ముందు ప్రభుత్వ ఏర్పాటుకు షేక్ బహదూర్ దేవ్ బా, కెపి.శర్మ ఓలి చేసిన వినతిని ఆమె నిర్ద్వందంగా తోసిపుచ్చారు. అధ్యక్షురాలు పార్లమెంటును రద్దు చేశారని, మొదటి సాధారణ ఎన్నికలు నవంబర్ 12న, రెండో దశ ఎన్నికలు 19న నిర్వహించాలని ఆదేశించారని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవలే ప్రధానిగా బాద్యతలు చేపట్టిన కెపి.శర్మ బలనిరూపణకు వెనక్కి తగ్గగా, ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాల్సిందిగా ఇతర పార్టీలకు అధ్యక్షురాలు పార్టీను ఆహ్వానించింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు గడువు ఇచ్చింది. విపక్ష పార్టీ తమకు 149 మంది సభ్యుల బలం ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరగా అధ్యక్షురాలు అనుమతించకుండా పార్లమెంటును రద్దు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.