FbTelugu

ఇంటర్ ఫలితాల విడుదలకు సిద్ధం: ఉమర్ జలీల్

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల విడుదల చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇంటర్మీడియట్ సెక్రెటరీ ఉమర్ జలీల్ తెలిపారు. అయితే ప్రభుత్వ ఆదేశాల తర్వాతే ఫలితాలను విడుదల చేస్తామన్నారు.

దీనిపై రేపు సాయంత్రంలోగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఆదేశిస్తే ఈ నెల 15న లేదా 16 న ఫలితాలు విడుదల చేస్తామన్నారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు కూడా సిద్ధంగా ఉన్నామన్నారు.

You might also like