* డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు సిద్ధం
* రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండడంతో నిర్ణయం
హైదరాబాద్ : కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా పూర్తిగా నిలిపివేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు తాజాగా.. ప్రారంభం అయినాయి. రాష్ట్రంలో వాహన ప్రమాదాలు తీవ్రంగా పెరిగిపోతుండడంతో ఎలగైనా..
డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పోలీసులు నిర్ణయించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ లు చేస్తున్నారు. గత కొంత కాలంగా రాష్ట్రంలో అత్యధికంగా జరుగుతున్న వాహన ప్రమాదాలకు మద్యం మత్తు అనే గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తాగి వాహనాలు నడిపే వారిపై ఎప్పటిలాగే చర్యలుంటాయని తెలిపారు.