FbTelugu

1.32 లక్షల ఉద్యోగాలిచ్చాం: కేటీఆర్

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధానమంత్రి గా పనిచేసిన ఏకైక వ్యక్తి పీవీ నరసింహారావు అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పీవీ నరసింహారావు కూతురు అయినా ఏనాడు కూడా వాణీదేవీలో గర్వం కనిపించలేదన్నారు.

ఇవాళ తెలంగాణ భవన్ లో మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికపై సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, పీవీ కి చెడ్డపేరు తెచ్చేపని ఇన్ని సంవత్సరాలలో వాణీదేవీ  ఎన్నడూ చేయలేదన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కి  ఉండాల్సిన అర్హతలన్ని వాణీదేవీ కి ఉన్నాయన్నారు. ఆమెకు ఉన్న అర్హతలు ఇతర పార్టీల్లో ఉన్న అభ్యర్థులకు ఎవ్వరికి లేవన్నారు. 2004- 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ ద్వారా 24వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ లో 2004- 2014 వరకు 10వేలు మాత్రమే భర్తీ చేశారని వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 1లక్షా 32వేల 799 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని కేటీఆర్ తెలిపారు.

ఎంపీ కె.కేశవ రావు మాట్లాడుతూ, విద్యా రంగంలో కేంద్రం దేశం ప్రజలకు, తెలంగాణ కు చేసింది ఏమీలేదన్నారు. పీవీ నరసింహారావు సేవలు దేశానికి, రాష్ట్రానికి చేసిన పనులను ప్రజలు మర్చిపోలేదన్నారు. సురబీ వానిదేవి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు  పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో దిగుతున్నానని చెప్పారు. నా నరనరాల్లో ప్రజాసేవ జీర్ణించుకోపోయిందన్నారు. విద్యాసంస్థలను స్థాపించి విద్యా సేవను చేస్తున్నానన్నారు.  విద్యార్థులను 35 ఏళ్లుగా నేను గైడ్ చేస్తూ పేరొందాను. గడిచిన 35 ఏళ్ల నుంచి 1లక్షకు పైగా విద్యార్థులు మా విద్యాలయాల నుంచి ఉద్యోగాలు పొందారు. చిన్న అణువు నుంచి అంతరిక్షం వరకు నా విద్యార్థులు పనిచేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. మా నాన్నకు రిటైర్మెంట్ సమయంలో ప్రధాని పదవి వచ్చినట్లు గానే నాకు ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యే  అవకాశం కల్పించారని వాణీదేవీ అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.