FbTelugu

అకాల వర్షాలు… చేతికొచ్చే పంట నాశనం

హైదరాబాద్: రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతన్నలు మరింతగా కుంగదీశాయి.

వడగండ్ల వాన కురవడంతో చేతికి వచ్చిన పంట వేలాది ఎకరాల్లో నేల పాలైంది. మామిడి కాయలు నేల రాలడంతో రైతన్నలు ఆర్థికంగా నష్టపోయారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పడంతో అందుబాటులో ఉన్న పంటను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

భువనగిరి జిల్లా జంగంపల్లి గ్రామం, తుర్కపల్లి మండలం ఋష్తపురం గ్రామంలో గురువారం నాడు కురిసిన అకాల వర్షానికి ధ్వంసమైంది. ఇలా పలు గ్రామాల్లో పంటలు ధ్వంసం కావడంతో నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

You might also like