FbTelugu

గర్భిణీలు వ్యాక్సిన్ తీసుకోవాలి…

మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: వ్యాక్సిన్లపై ఉన్న అపోహలను గర్భిణీ మహిళలల్లో తొలగించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. వ్యాక్సిన్ వల్ల కలిగే ప్రయోజనాలను ఆరోగ్య కార్యకర్తలు వివరించడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలని సూచించింది.
గర్భిణీలకు కరోనా వైరస్ సోకినా 90 శాతం మంది హాస్పిటల్ కు వెళ్లకుండానే ఇంటివద్దే చికిత్స పొంది రికవరీ అవుతున్నారని తమ పరిశోధనలో వెల్లడైంది.

కొన్ని కేసుల్లో మాత్రం ఆరోగ్యం క్షీణించి, పిండంపై అధిక ప్రభావం చూపిస్తున్నది. ఈ పరిణామాలతో ప్రతి గర్భిణీ మహిళ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకునేలా ఆరోగ్య కార్యకర్తలు ప్రచారం చేయాలి. అయితే 35 సంవత్సరాలు దాటిన మహిళలు బిపి, అధిక బరువు వంటి సమస్యలు ఉన్న గర్భిణీలకు ముప్పు ఎక్కువ. కరోనా వైరస్ సోకి తగ్గిన గర్భిణీలకు జన్మించిన 95శాతం శిశువులు ఆరోగ్యంగా ఉన్నారు. కరోనా వచ్చి, ప్రసవం తరువాత వారికి వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం వేగిరం చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.