FbTelugu

అయ్యో తల్లీ అంత్యక్రియల్లోనూ వివక్షేనా!

హైదరాబాద్: ఎన్ని హాస్పిటళ్లు తిరిగినా అడ్మిషన్ దొరక్క చనిపోయిన నిండు గర్భిణీ పావని కి ఆఖరికి స్మశాన వాటికలోనూ వివక్షే ఎదురైంది. హాస్పిటల్ లో ఎవరూ చేర్చుకోవడంతో చివరకు అంబూలెన్స్ లోనే తనువు చాలించింది.

నిండు గర్భిణీ కావడంతో ఇవాళ అంత్యక్రియలు చేసేందుకు కాటికాపరులు నిరాకరించారు. హిందూ సాంప్రదాయం ప్రకారం తల్లి గర్భం నుంచి బిడ్డను వేరు చేస్తే కాని దహనం చేయడం కుదరదని స్పష్టం చేశారు. మళ్లీ పావని భర్త, తల్లి ఐదు ఆసుపత్రులను తిరగ్గా ఆపరేషన్ చేయడం కుదరదని స్పష్టం చేయడంతో కన్నీటి పర్యంతం అయ్యారు. దిక్కుతోచని స్థితిలో పుట్టెడు దుఃఖంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లారు. ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో అధికారులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మల్లాపురం స్మశాన వాటిక నిర్వాహకులతో మాట్లాడి, అంత్యక్రియలు పూర్తి చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.