గద్వాల: బస్సులోనే ఓ మహిళ పండండి బిడ్డకు జన్మనిచ్చిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు మండల కేంద్రంలో ఇవాళ(బుధవారం) చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. గొర్లఖాన్దొడ్డి గ్రామానికి చెందిన ఓ గర్భిణికి ఇవాళ ఉదయం పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి పయనమైనారు.
అదే సమయంలో బస్సు రావడంతో బస్సు ఎక్కారు. అయితే మరి కాసేపట్లో ఆస్పత్రికి చేరుతారన్న సమయానికే నొప్పులు ఎక్కువైనాయి. దీంతో బస్సులోనే పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది. వారిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.