FbTelugu

ప్రభుత్వానికి పీఆర్సీ నివేదిక

హైదరాబాద్: పీఆర్సీ నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు అందచేశారు. ఈ నివేదికను సీఎస్, ఫైనాన్స్ సెక్రెటరీ, ఇరిగేషన్ సెక్రెటరీల కమిటీ అధ్యయనం చేయనుంది.

అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ కు నివేదించనున్నారు. అధికారులు పీఆర్సీ వివరాలు నివేదించిన తరవాత ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ భేటీకానున్నారు. ఆపై ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టనున్నారు. త్వరలోనే ఉద్యోగుల అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఉద్యోగ సంఘ నాయకులకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అలాగే 857 మంది (నాలుగో తరగతి, ఎన్జీఓ) ఉద్యోగులను ఏపీ నుంచి తెలంగాణకు తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.