FbTelugu

ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలి: సీపీ అంజనీ కుమార్

సికింద్రాబాద్ : ఇవాళ హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ఎంజే మార్కెట్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పలు సూచనలు చేశారు. ఎంజే మార్కెట్ లో ప్రజలు సమాజిక దూరం పాటించడంలేదని, కచ్చితంగా పాటించాలని అన్నారు.

నగరంలో లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నట్టు తెలిపారు. ముస్లిం సోదరులు ఇళ్లలోనే రంజాన్ ప్రార్థనలు జరుపుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైకి వస్తే కఠినంగా వ్యవహరిస్తామనే తెలిపారు.

You might also like