FbTelugu

మృతదేహం వద్ద 22 రోజులుగా ప్రార్థనలు

* ప్రార్థనలు చేస్తే బతుకుతుందని సూచించిన పాస్టర్
* నమ్మి ప్రార్థనలు చేస్తున్న పిల్లలు
* నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
చెన్నై: చనిపోయిన ఓ మహిళ వద్ద ప్రార్థనలు చేస్తే మళ్లీ బతుకుతుందన్న పాస్టర్ మాటలు నమ్మి.. గత 22 రోజులుగా తల్లి మృతదేహం వద్దే పిల్లలు ప్రార్థనలు నిర్వహించిన ఘటన తమిళనాడులోని దిండిగల్ జిల్లా నందనవట్టి కాలనీలో చోటుచేసుకుని తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

స్థానిక నందనవట్టి కాలనీలో ఇందిరా అనే మహిళ అనారోగ్యంతో డిసెంబర్ 07న మరణించింది. ప్రార్థనలు చేస్తే ఇందిరా బతుకుతుందని సుదర్శన్ అనే పాస్టర్ మృతురాలి పిల్లలకు సూచించాడు. దీంతో నిజమేనని నమ్మిన పిల్లలు 22 రోజులుగా ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పాస్టర్ సుదర్శన్ తో పాటూ.. మృతురాలి అక్క వాసుకీని అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.