FbTelugu

హుజూరాబాద్ లో పోటీ చేయను: ప్రవీణ్

హైదరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన తనకు లేదని మాజీ ఐపిఎస్ అధికారి ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త విప్లవం రాబోతున్నదని ఆయన అన్నారు.
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత డెబ్బై సంవత్సరాల్లో అట్టడగు వర్గాలకు తీరని అన్యాయం జరిగిందని, ఆ వర్గాల కోసం నిరంతరం పోరాటం చేస్తానన్నారు.

అక్షరం, ఆర్థికం, ఆరోగ్యం ఎజెండగా… మహాత్మా జ్యోతిరావు పూలే, బాబా సాహెబ్ అంబేద్కర్, కాన్షిరామ్ ఆశయాల కోసం పోరాటం చేయనున్నట్లు ప్రకటించారు. సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేసి అట్టడగు వర్గాల్లో 1 శాతం మార్పు తీసుకురాగలిగానని, ఇంకా తొంబై తొమ్మిది శాతం ప్రజల జీవితాల్లో మార్పు కోసం పనిచేయనున్నట్లు వెల్లడించారు.
రాజీనామా ఆమోదం…
ప్రవీణ్ కుమార్ రాజీనామా ను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఐపిఎస్ పదవికి రాజీనామా చేస్తూ రెండు రోజుల క్రితం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ పంపించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.