FbTelugu

హుజూరాబాద్ రేసులో ప్రవీణ్ రెడ్డి?

వరంగల్: హుజూరాబాద్ నియోజకవర్గానికి త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా నిరూపించుకోవాలనే పట్టుదలతో టిఆర్ఎస్ అధినాయకత్వం ఉంది. అభ్యర్థుల కోసం ఇప్పటికే వేట మొదలుపెట్టింది.

ప్రస్తుత ఎమ్మెల్యే అయిన ఈటల రాజేందర్ ను గట్టిగా ఎదుర్కొనే నాయకుడి కోసం జల్లెడ పడుతున్నారు. నియోజకవర్గం బాధ్యతలను మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ కు అప్పగించారు. హరీశ్ రావు ప్రతి రోజు నియోజకవర్గ నాయకులను సిద్దిపేట లేదా హైదరాబాద్ పిలిపించి చర్చలు జరుపుతున్నారు. పనిలో పనిగా ప్రత్యర్థి పార్టీలకు వల వేస్తున్నారు. నియోజకవర్గం మొత్తం ఓటర్ల సంఖ్య 2.05 లక్షలు కాగా ఇందులో సగానికి పైగా బిసి కులాలు ఉన్నాయి. రెడ్డి కులం ఓట్లు 40వేల వరకు ఉండగా మిగతా ఓట్లు ఎస్సి, ఎస్టీలవే. వివాద రహితుడు, సౌమ్యుడు, మాజీ ఎమ్మెల్యే అయిన అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పేరును టిఆర్ఎస్ తీవ్రంగా పరిశీలిస్తున్నది. వైఎస్.రాజశేఖర రెడ్డి సిఎం గా ఉన్న సమయంలో ప్రవీణ్ హుస్నాబాద్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఒకవేళ రెడ్డి కులానికి చెందిన వారికి ఇస్తే ప్రవీణ్ పేరు అగ్రస్థానంలో ఉండనున్నది. వెలమ కులానికి ఇస్తే రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ బి.వినోద్ కుమార్ పేరు ఖరారు చేయనున్నారు. పిసిసి అధ్యక్షుడు, ఎంపి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరి బంధువు కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ టికెట్ కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారనే ప్రచారం జరుగుతున్నది. ఒక కార్యక్రమానికి హాజరైన మంత్రి కెటిఆర్ ను కౌశిక్ రెడ్డి కలిశారు. గత ఎన్నికల్లో ఈటల రాజేందర్ పై కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.