FbTelugu

థర్డ్ ఫ్రంట్… పవార్, పికె భేటీ

న్యూఢిల్లీ: 2024 పార్లమెంటు ఎన్నికల్లో బిజెపిని ఇంటికి సాగనంపేందుకు ఇప్పటి నుంచే ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతున్నాయి. మూడో ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు ఊపందుకున్నాయి.

సోమవారం నాడు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ తో భేటీ అయి సుధీర్ఘంగా చర్చించారు. 15 పార్టీలతో కూడిన విపక్ష పార్టీ ప్రతినిధులకు సమావేశ ఆహ్వానం పంపించారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమావేశానికి హాజరు కావాలని 15 పార్టీలను కోరారు. దీంతో ఢిల్లీలో రాజకీయ వేడి మొదలైంది. అంతకు ముందు పికె, పవార్ మధ్య జూన్ 12న తొలి సమావేశం ముంబయిలో జరిగిన విషయం తెలిసిందే. ఈ భేటీలో ప్రధానంగా బిజెపిని ఎలా ఎదుర్కోవాలి, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశానికి అంత ప్రాధాన్యత లేదని, రాజకీయ అంశాలపై మాత్రమే చర్చించామని ప్రశాంత్ కిశోర్ మీడియాకు చెప్పారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.