FbTelugu

క్షీణించిన ప్రణబ్ ఆరోగ్యం: హెల్త్ బులెట్

ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింతంగా దిగజారిందని ఆర్మీ రీసెర్చి అండ్ రెఫరల్ హాస్పిటల్ వర్గాలు హెల్త్ బులెట్ విడుదల చేశాయి. ఆయన ఇంకా వెంటిలేటర్ పై ఉన్నారని, ఆరోగ్యం మెరుగుపడటం లేదని తెలిపారు.

ఊపిరితిత్తుల్లో సమస్య తలెత్తిందని, కుదురుకోవడం లేదని వైద్యులు ప్రకటించారు. ప్రత్యేక వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తున్నదని పేర్కొన్నారు. తన తండ్రి ఆరోగ్యంగానే ఉన్నారని ప్రణబ్ కుమారుడు అభిజిత్ ప్రకటించిన కొద్ది సేపటికే హాస్పిటల్ వర్గాలు బులెటిన్ విడుదల చేశాయి.

You might also like