FbTelugu

ప్రకాశం బ్యారేజీ 7 గేట్లు ఎత్తివేత

ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మున్నేరు వాగు నుంచి ప్రకాశం బ్యారేజీకి 14 వేల క్యూసెక్కుల నీరువచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజీ 7 గేట్లను ఎత్తివేసి దిగువకు 7,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

వరద ఉదృతి పెరగడంతో దవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. వారం రోజుల పాటూ గోదావరికి వరద ఉదృతి ఉండనున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు.

You might also like