FbTelugu

ప్రకాశం బ్యారేజీ 20 గేట్లు ఎత్తివేత

గత కొన్ని రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరద ఎక్కువ కావడంతో అధికారులు 20 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. నిన్నటి వరకు వరద ఉదృతి తక్కువగా ఉండడంతో 5 గేట్లను ఎత్తి నీటిని వదిలారు.

ఈ రోజు వరద ఉదృతి ఎక్కువ కావడంతో 20 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నట్టు అధికారులు తెలిపారు.

You might also like