FbTelugu

‘‘మా’’ లో స్థానిక సమస్య లేదు: ప్రకాశ్ రాజ్

హైదరాబాద్: మువీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో పోటీచేయాలనేది నిన్న మొన్న స్టార్ట్ చేసింది కాదని, ఆరు నెలల గా వ్యూహాలు రచిస్తున్నామని క్యారెక్టర్ ఆర్టిస్టు ప్రకాశ్ రాజ్ తెలిపారు. మా ప్యానల్ లో ఎవరు ఉండాలి ఎలాంటి వారు ఉండాలి అని చూసి నిర్ణయించామన్నారు.
ఇవాళ ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ పై మీడియాతో మాట్లాడారు. వీటిని ఎన్నికల్లాగా కాకుండా అందరి సంక్షేమం కోసం చేస్తున్నామని, మనం చిత్తశుద్ధి గా ఉంటామా లేదా అనేది ముఖ్యమన్నారు. గొడవలు లేకుండా సూక్ష్మంగా సమస్య ను పరిష్కరించుకోవాలనేది మా లక్ష్యమన్నారు. నా ప్యానెల్ లో నలుగురు అధ్యక్షులు ఉన్నారని, నేను తప్పు చేసిన బయటికి పంపిస్తారన్నారు. సభ్యుల సమస్యల గురించి మాట్లాడకుండా ఇష్టానుసారంగా వ్యక్తులను ఎంపిక చేస్తున్నారు. ఎన్నికల్లో గెలవలేనివారు లోకల్, నాన్ లోకల్ సమస్య సృష్టిస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా లోకల్, నాన్ లోకల్ సమస్య సృష్టించారని ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు.
నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ, నా స్థలంలో 10 ఎకరాలు ప్రకాష్ రాజ్ అన్నకు ఇచ్చాను.. అందులో ఎంతో మందికి పని కల్పించారన్నారు. ప్రకాశ్ రాజ్ కి అవకాశం ఇస్తే అసోసియేషన్ బాగుంటుందన్నారు. ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనే సమస్య లేదన్నారు. 23 ఏళ్ళు ఆయన ఇక్కడ స్థిరపడి.. మా ఊళ్ళో ఏందో మందికి పని ఇచ్చారు. ప్రకాష్ రాజ్ అంటే మా ఊళ్ళో తెలియని వారు ఉండరన్నారు.

నటుడు కొణిదెల నాగబాబు మాట్లాడతూ, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కి మా అన్నయ్య చిరంజీవి మద్దతు కూడా తెలిపారన్నారు. రెండు నెలల కింద ప్రకాష్ రాజ్ మమ్మల్ని కలిసి మువీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఉన్న సమస్యలు వివరించాడన్నారు. బిల్డింగ్ లేదు.. మా అంటే ఒక కుటుంబం అని చెప్పాడు. ప్రతి ఒక్కరితో మాట్లాడే సత్తా ఉన్న వ్యక్తి అని అన్నారు. మూడు నాలుగు గ్రామాలను దత్తత తీసుకొని అక్కడి వారికి పని కల్పించాడు. ఇలాంటి వ్యక్తి మా అసోసియేషన్ లో ఉంటే బాగుంటుందని అనుకున్నామన్నారు. ఇక్కడ లోకల్, నాన్ లోకల్ అనేది సమస్య ఉత్పన్నం కాదన్నారు. పెద్దోళ్లకే లేని లోకల్ సమస్య ఒక కుటుంబం లాగా ఉండే వారికి ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు మేము సంపూర్ణ మద్ధతు తెలుపుతున్నామని నాగబాబు చెప్పారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.