FbTelugu

మేయర్ అభ్యర్థికి ప్రగతి భవన్ పిలుపు

హైదరాబాద్: గ్రేటర్ ఫలితాలు వెలువడ్డంతో మేయర్ అభ్యర్థి ఎంపికపై టీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్, ఆయన తనయుడు ఐటీ మంత్రి కేటీఆర్ దృష్టి సారించారు.

ఎలాగైనా మేయర్ పీఠం కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. భారతీ నగర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన సింధూ ఆదర్శ్ రెడ్డి ని ప్రగతి భవన్ రావాల్సిందిగా సమాచారం వెళ్లింది. మెదక్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి కోడలు సింధూ ఆదర్శ్ రెడ్డి. మేయర్ పీఠం మహిళ (జనరల్) కు రిజర్వ్ కావడంతో ఆమెనే దాదాపు ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. కాని పక్షంలో శేరిలింగం పల్లి నియోజకవర్గంలోని వివేకానందనగర్ గెలుపొందిన రోజా రంగారావు ను కూడా మేయర్ గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. వెలమ కులానికి చెందిన ఈమెను నియమించే అవకాశాలను కూడా తోసిపుచ్చలేము.

You might also like

Leave A Reply

Your email address will not be published.