FbTelugu

ఈటల గతి తనకు పట్టదు: జగదీశ్ రెడ్డి ధీమా

హైదరాబాద్: తనకు ఈటల రాజేందర్ గతి పట్టదని, కలలో కూడా అది జరగదని విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. కర్ణాటక రాష్ట్రం హంపిలో తన కుమారుడి బర్త్ డే వేడుకల్లో జరిగిన సంభాషణలపై కట్టుకథలు అల్లారాని కొట్టిపారేశారు.

ఇవాళ జగదీశ్ రెడ్డి హైదరాబాద్ లో మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీ నాయకులు తనపై హంపి ఎపిసోడ్ బయటకు తీసుకువచ్చారన్నారు. హంపి కథనంతో తనకు ఈటల రాజేందర్ కు పట్టిన గతి తనకు పడుతుందని కొందరు ప్రత్యర్థులు శునకానందం పొందుతున్నారని, 2023 వరకు మంత్రిగానే కొనసాగుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు హంపి కథనాన్ని వండి వార్చారని ఆయన ఆరోపించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో మంత్రి జగదీశ్ రెడ్డి తన కుమారుడి బర్త్ డే వేడుకను తెలంగాణ లో కాకుండా కర్ణాటకలోని హంపిలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్య, చంట్రి క్రాంతి కిరణ్ తో పాటు ఒక ఛైర్మన్, మరో మాజీ చైర్మన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ వైఖరి, కెటిఆర్ సిఎం పదవి పై చర్చించుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. ఈ వార్త రాష్ట్రంలో సంచలనంగా మారింది. వారం రోజుల క్రితం వచ్చిన ఈ కథనంపై ఇవాళ జగదీశ్ రెడ్డి స్పందించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.