FbTelugu

ఆంధ్రాలో విద్యుత్ లోడ్ చార్జీల బాదుడు

అమరావతి: ఏపీలో విద్యుత్ పంపిణీ సంస్థల లోడ్ చార్జీల బాదుడు మొదలుపెట్టాయి. అత్యవసరంగా లోడ్ పెంచుకోవాలంటూ వినియోగదారులకు నోటీసులు జారీ చేస్తున్నది.

సిపిడిసిఎల్ పరిధిలోని ప్రతి ఇంటికి అదనపు లోడ్ నోటీసులు జారీ చేయడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. రెండు మెగావాట్ల అదనపు లోడుకు రూ.3000లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వారంలోగా చెల్లించకపోతే ప్యూజులు తొలగిస్తాం అంటూ హెచ్చరించారు. లోడ్ చార్జీల పేరుతో ఇప్పటికే విజయవాడ పరిధిలో రూ.3వేల వేల కోట్లకు పైగా అదనపు చార్జీలు వసూలు చేశారు. విద్యుత్ చార్జీలు పెంచడం లేదంటూ చెప్పిన ప్రభుత్వం ఇలా పరోక్షంగా బాదుడు ఏంటని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.