FbTelugu

కరెంటు కోతలు… జనరేటర్ పెట్టాల్సిందే: మేయర్ విజయలక్ష్మీ

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ మరో వివాదానికి కేంద్ర బిందువు అయ్యారు. బంజారాహిల్స్ డివిజన్ లోని తన క్యాంప్ కార్యాలయంలో 25 కిలోవాట్ల సామర్థ్యం కల విద్యుత్ జనరేటర్ ఏర్పాటు చేయాలని కమిషనర్ కు లేఖ రాశారు.

తన క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు కరెంటు అవాంతరం ఏర్పడుతోందని, ఫలితంగా రోజువారి కార్యకలాపాలకు ఇబ్బంది కలుగుతున్నదని తెలిపారు. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 25 కిలోవాట్ల జనరేటర్ తో కనీసం ఐదు ఫ్లాట్లకు విద్యుత్ సరఫరా చేయవచ్చని, అంత సామర్థ్యం ఉన్నది అవసరమా అనేది కామెంట్లు చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణలో, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో కోతలు లేకుండా కరెంటు సరఫరా చేస్తున్నారు. ఒకవేళ కరెంటు పోయినా ఐదారు నిమిషాల్లోనే పునరుద్దరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరువు తీసే విధంగా విజయలక్ష్మీ లేఖ ఉందంటూ పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే రెండు అంశాల్లో ఆమె చేసిన పనులు వివాదాస్పదం కాగా తాజాగా మరో అంశాన్ని తెరమీదికి తెచ్చి నెటిజన్లకు చేతినిండా పనికల్పిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.