FbTelugu

సోషల్ మీడియాలో పోస్టు.. వివాహిత ఆత్మహత్య

నిర్మల్: సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ కావడంతో అవమానం భరించలేని ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్నది. పురుషోత్తం అనే వ్యక్తి సదరు మహిళకు చెందిన అసభ్యకర భంగిమ ఫొటోలను షేర్ చేశాడు.

ఈ విషయం ఆనోటా ఈనోటా ఆమె కు తెలియడంతో తీవ్ర వేదనకు గురైంది. అకారణంగా తనపై కక్ష పెట్టుకుని ఫొటోలు పోస్టు చేశాడంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉందని, ఒక రోజు గడిస్తే కాని ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. భర్త ఫిర్యాదు మేరకు పురుషోత్తంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

You might also like