FbTelugu

గవర్నర్ పురోహిత్ కు పాజిటివ్

చెన్నై: తమిళనాడు గవర్నర్ భన్వరి లాల్ పురోహిత్ కు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యిందని కావేరి హాస్పిటల్ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

అల్వార్ పేటలోని కావేరి హాస్పిటల్ లో ఆయన పరీక్షలు చేయించుకున్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. హోం ఐసోలేషన్ లో ఉన్నారని, వైద్య నిపుణుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నదని హస్పిటల్ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ డా.అరవిందన్ సెల్వరాజ్ ప్రకటించారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తమిళనాడు గవర్నర్ భన్వరి లాల్ ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ ఒక ప్రకటనలో తెలిపారు.

You might also like