FbTelugu

పాజిటివ్ రిపోర్టు… విలపించిన క్రికెటర్

చెన్నై: కరోనా పాజిటివ్ రానంత వరకే ఎవరైనా ధైర్యంగా ఉంటారు. అది సోకిందని తెలియగానే కొందరికి భయం పట్టుకుంటుంది. ఆ కోవలోనే న్యూజిలాండ్ క్రికెటర్ టిమ్ సీఫెర్ట్ పాజిటివ్ రాగానే బోరుమని ఏడ్చేశాడు.
సెకండ్ వేవ్ కారణంగా ఐపిఎల్ ను నిరవధికంగా వాయిదా వేశారు. టిమ్ సీఫెర్ట్ కొలకతా నైట్ రైడర్స్ జట్టు సభ్యుడు.

ఐపిఎల్ వాయిదా పడగానే తమ దేశస్థులతో కలిసి స్వదేశం వెళ్లేందుకు రెడీ అయ్యాడు. విమానం ఎక్కేందుకు సిద్ధమవుతుండగా పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్ రిపోర్టు వచ్చింది. సహచరులు వెళ్లిపోగా, అతను మాత్రం చెన్నై లోని క్వారంటైన్ సెంటర్ కు వెళ్లిపోయాడు. పాజిటివ్ రిపోర్టు అని తెలియగానే కాళ్లు, చేతులు వణికాయని, ఆక్సిజన్ తీసుకోవాలా అని భయపడిపోయానని టిమ్ కంగారు పడ్డాడు. తనకు ఆసుపత్రిలో పడక దొరుకుతుందా, బయట జరుగుతున్ ప్రచారం ప్రకారం తనకూ జరుగుతుందా అని అనుమానపడినట్లు తెలిపాడు. చెన్నై సూపర్ కింగ్స్, కొలకతా నైట్ రైడర్స్ సహకారంతో కోలుకున్నట్లు ఆయన వివరించాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.