FbTelugu

ఇద్దరు ఏపీ ఎంపీలకు పాజిటివ్

ఢిల్లీ: అరకు ఎంపీ మాధవి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఎంపీ మాధవి పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చింది.
సమావేశాలకు హాజరవుతున్న ప్రతి సభ్యుడికి ఇవాళ పార్లమెంటు సెక్రెటేరియట్ లో కరోనా పరీక్షలు నిర్వహించారు.

కరోనా పరీక్షల్లో పాజిటివ్ గా తేలడంతో రెండు వారాల పాటు ఢిల్లీలోనే ఉండి మాధవి చికిత్స తీసు కోనున్నారు. మరో ఎంపీ రెడ్డప్ప కు ఎటువంటి లక్షణాలు లేకుండానే పాజిటివ్ ఫలితం వచ్చింది. ఐసోలేషన్ లో ఉండాలని అధికారులు సూచించారు.

You might also like