FbTelugu

సిఎం యడ్యూరప్పకు రెండోసారి పాజిటివ్

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్.యడ్యూరప్పకు రెండోసారి కరోనా పాజిటివ్ నిర్థారణ కావడంతో ఆసుపత్రిలో చేరారు. ఎనిమిది నెలల వ్యవధిలో రెండోసారి ఆయనకు పాజిటివ్ వచ్చింది.

ఈ విషయాన్ని యడ్యూరప్ప ట్వీట్ చేశారు. జ్వరం, నలతగా అన్పించడంతో కరోనా పరీక్షలు చేయించగా పాజిటివ్ అని తేలింది. ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో చేరాను. గత నాలుగైదు రోజులుగా తనను కలిసిన వారందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. మార్చి 13వ తేదీన ఆరోగ్య శాఖ మంత్రి కె.సుధాకర్ తో కలిసి కోవాగ్జిన్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. బెంగళూరు లోని సిక్కిం మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే పాజిటివ్ నిర్థారణకు ముందు ఆయన తన నివాసంలో ఉన్నతాధికారులతో పలు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఆ తరువాత మీడియా సమావేశం కూడా నిర్వహించారు. వీరందరూ తమకు కరోనా ఉందేమోనంటూ కొంత ఆందోళనకు గురవుతున్నారు.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.