FbTelugu

సచిన్, పరేశ్ లకు పాజిటివ్

ముంబయి: క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ప్రముఖ నటుడు పరేశ్ రావల్ కు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. తేలికపాటి లక్షణాలు కన్పించడంతో పరీక్ష చేయించుకోగా వైరస్ సోకినట్లు రిపోర్టు వచ్చిందని సచిన్ తెలిపారు.

వైద్యుల సూచన మేరకు హోం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పారు. తన ఇంట్లో అందరికీ నెగెటివ్ వచ్చిందని సచిన్ పేర్కొన్నారు. దురదృష్ణవశాత్తు తనకు పాజిటివ్ అని పరీక్షలో తేలింది, గత పదిరోజులలో తనతో సన్నిహితంగా మెలిగిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని పరేశ్ రావల్ ట్వీట్ చేశారు. అయితే మార్చి 9వ తేదీన పరేశ్ రావల్ వ్యాక్సిన్ మోదటి డోస్ వేసుకున్నారు. ఈ విషయాన్ని కూడా ఆయన ట్వీట్ ద్వార వెల్లడించారు. తగిన జాగ్రత్తలు పాటించకపోవడంతో కరోనా వైరస్ సోకింది. ఇప్పటికే బాలీవుడ్ మిలింద్ సోమన్, అమిర్ ఖాన్, రణబీర్ కపూర్, కార్తిక్ ఆర్యన్, మనోజ్ బాజ్ పేయి లకు కరోనా పాజటివ్ సోకింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.