FbTelugu

80వేల మంది చిన్నారులకు పాజిటివ్

న్యూఢిల్లీ: గతేడాది పెద్దలు, యువకులపై పంజా విసిరిన కరోనా వైరస్ ఈసారి చిన్నారులపై బుసలు కొడుతున్నది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే 79,688 మంది చిన్నారులకు పాజిటివ్ నిర్థారణ అయ్యిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో మార్చి 1 నుంచి ఏప్రిల్ 4వ తేదీ మధ్యలో 60,684 మంది చిన్నారులకు వైరస్ సోకింది.

ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి ఉందని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి వైద్యులు వివరించారు. ఢిల్లీలో 2,773 మంది చిన్నారులు వైరస్ బారిన పడగా, ఐదు సంవత్సరాల లోపు వారు 441 మంది ఉణ్నారు. సోకిన వారిలో అత్యధికంగా మురికివాడల పిల్లలు, పేదరికంలో మగ్గుతున్నవారు ఉండడం ఆందోళన కలిగించే అంశం. చిన్నారుల కోసం ఇంకా వ్యాక్సిన్ రాకపోవడం కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. చిన్నారుల కోసం తయారు చేసిన వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉన్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.