FbTelugu

అసెంబ్లీలో పోర్న్‌ వీడియోలు కలకలం

బెంగళూరు: అసెంబ్లీలో మరో మారు ఓ ప్రజాప్రతినిధి పోర్న్‌ వీడియోలు చూసిన ఘటన కర్ణాటకలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకెళితే.. కర్ణాటక శాసన సభలో నిన్న (శుక్రవారం) బడ్జెట్‌ సమావేశాలు జరుగుతుండగా.. బిల్లులపై చర్చ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ప్రకాశ్‌ రాథోడ్‌ పోర్న్‌ వీడియో చూస్తూ కెమెరాలకు అడ్డంగా చిక్కాడు.

ఎమ్మెల్యే తీరుపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ రాథోడ్‌.. మొబైల్‌ ఫోన్‌లో మెమొరీ నిండిపోగా.. అనవసరంగా స్టోరైన వీడియోలను డిలీట్‌ చేశానని, ఏ వీడియోలు చూడలేదన్నారు. ఇలాంటి ఘటన గతంలోనూ ముగ్గురు ఎమ్మెల్యేలు కర్ణాటక శాసనభలో పోర్న్‌ వీడియోలు చూస్తూ కెమెరాలకు చిక్కడం గమనార్హం.

You might also like

Leave A Reply

Your email address will not be published.