FbTelugu

కరోనా దెబ్బకు.. జ‌నాభా లెక్క‌లు వాయిదా

న్యూఢిల్లీ : దేశంలో రోజు రోజుకి తీవ్రంగా పెరిగిపోతున్న కరోనా ప్రభావం జనాభా లెక్కలపై కూడా పడింది. ఇవాళ రాజ్య‌స‌భ‌లో హోం మంత్రిత్వ శాఖ‌ దేశంలో క‌రోనా కేసులు పెరిగితున్న కారణంగా జ‌నాభా లెక్క‌ల సేకరణను వాయిదా వేసిన‌ట్టు తెలిపింది.

భారత్ లో ప్రతి పదేళ్లకొకసారి జనాభా లెక్కలు సేకరిస్తారు. చివరి సారిగా.. 2011 లో జనాభా లెక్కలు సేకరించడం జరిగింది. వాస్తవానికి మొదటి విడతగా జనాభా లెక్కలు ఈ ఏడాది ఏప్రిల్ 01వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు జరగాల్సి ఉండగా.. వాయిదా పడినట్లు తెలిపింది. అయితే తదుపరి ఎప్పుడు లెక్కించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపింది.

You might also like