FbTelugu

జనాభా లెక్కలు, ఎన్పీఆర్ వాయిదా

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి జరగాల్సిన జనాభా లెక్కలు, ఎన్పీఆర్ లను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వాయిదా వేసింది.

తదుపరి ఎప్పటి నుంచి నిర్వహించేది త్వరలోనే తెలియచేస్తామని ప్రకటించింది. కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించింది. అయినప్పటికీ జనాలు రోడ్లపై సంచరిస్తున్నారు. ప్రజలను పూర్తిగా ఇళ్లకు పరిమితం చేసి, రోడ్లు నిర్మానుష్యం అయితే తప్ప కరోనా నియంత్రణ కాదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో హోం మంత్రిత్వ శాఖ జనాభా లెక్కలు, ఎన్పీఆర్ ను వాయిదా వేసింది

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More