FbTelugu

సిఎంలే బెదిరిస్తున్నారు: అదర్ పునావల్లా

లండన్: కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న సిరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఈఓ అదర్ పునావల్లా ముఖ్యమంత్రులు, మంత్రులపై సంచలన ఆరోపణలు చేశారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికలు, కుంభ మేళా గురించి మాట్లాడితే తల నరికేస్తామని, ఆనవాళ్లు లేకుండా శవం మాయం చేస్తామని బెదిరింపులకు దిగడంతో తను లండన్ లో తలదాచుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. లండన్ లో ఉన్న పూనావల్లా ది టైమ్స్ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తమను దిగ్బంధించి పనులు చేయనివ్వకుండా నిలువరించే లక్ష్యం వాళ్లలో స్పష్టంగా తనకు కన్పించినట్లు ఆయన తెలిపారు. ఇండియాలో తనకు ఇలాంటి పరిస్థితి ఎదురు కావడంతో ఆందోళనకు గురై కుటుంబంతో సహా లండన్ కు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ పరిస్థితిని గమనించే బ్రిటన్ సహా ఇతర దేశాల్లో వ్యాక్సిన్ తయారీ ని ప్రారంభించే ఆలోచనలో ఉన్నానని, త్వరలోనే దీనిపై ప్రకటన చేస్తానని పూనావల్లా చెప్పారు.

ఇండియాలో వ్యాక్సిన్ సమకూర్చే బాధ్యత తనపై ఉందని, కాని నేనొక్కడినే ఆ పని చేయలేనని ఆయన అన్నారు. కేవలం ఎక్స్, వై, జెడ్ ల కోసం తాను వ్యాక్సిన్ ను అందించలేనని ఆయన స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.