FbTelugu

విక్ట‌రీ వెంక‌టేశ్ సరసున పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది.

పెరుగుతున్న సినిమా మార్కెట్‌, మారుతున్న ట్రెండ్‌ను అనుస‌రించి విక్ట‌రీ వెంక‌టేశ్ , స‌ల్మాన్ ఖాన్‌తో క‌లిసి బాలీవుడ్ మూవీలో న‌టించ‌డానికి ఓకే అన్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఇది వ‌ర‌కు త‌క్‌దీర్ వాలా సినిమా స‌హా రెండు, మూడు హిందీ చిత్రాల్లో వెంక‌టేశ్ హీరోగా న‌టించాడు. త‌ర్వాత ఆయ‌న తెలుగుకే ప‌రిమితం అయ్యారు. అయితే ఇప్పుడు పెరుగుతున్న సినిమా మార్కెట్‌, మారుతున్న ట్రెండ్‌ను అనుస‌రించి విక్ట‌రీ వెంటేష్, స‌ల్మాన్ ఖాన్‌తో క‌లిసి బాలీవుడ్ మూవీలో న‌టించ‌డానికి ఓకే అన్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే స్పీడు చూసిన వారు అబ్బో మామూల్ది కాదుగా అనుకోక త‌ప్ప‌డం లేదు. ఎందుకంటే ఈమె చేస్తున్న ప్రాజెక్ట్స్ అలా ఉన్నాయి మ‌రి. భారీ సినిమాలు.. పెద్ద స్టార్స్ ఉన్న సినిమాలు కావ‌డం పూజా హెగ్డేకు బాగానే క‌లిసొస్తుంద‌నాలి. ఇలాంటి క్రేజీ మూవీస్‌లో యాక్ట్ చేయ‌డం వ‌ల్ల అనుకున్న దాని కంటే ఎక్కువ రెస్పాన్స్‌, గుర్తింపు పూజా హెగ్డేకు వ‌స్తుంది మ‌రి. ఇటు టాలీవుడ్ స్టార్ విక్ట‌రీ వెంక‌టేష్‌, పూజా హెగ్డే క‌లిసి న‌టించ‌బోయే బాలీవుడ్ సినిమా ఏదో కాదు.. బాలీవుడ్ మూవీ భాయ్ జాన్‌.

బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ హీరోగా న‌టించ‌నున్న ఈ చిత్రాన్ని ఫ‌ర్హాద్ సామ్‌జీ డైరెక్ట్ చేస్తుండ‌గా, సాజిద్ న‌డియ‌డ్‌వాలా నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా హైద‌రాబాద్‌లో జ‌రిగిన అంతిమ్ ప్రెస్‌మీట్‌లో స‌ల్మాన్ ఖాన్ మాట్లాడుతూ తాను వెంక‌టేష్‌తో క‌లిసి సినిమా చేయ‌బోతున్నాన‌ని, త్వ‌ర‌లోనే వివ‌రాల‌ను చెబుతాన‌ని అన్నారు. ఇంత‌కీ స‌ల్మాన్‌, వెంక‌టేశ్ క‌లిసి ఏ మూవీ చేస్తారా? అని అప్ప‌టి నుంచి అంద‌రిలో ఆస‌క్తి పెరిగిపోయింది. అయితే ఆ సినిమా ఏదో కాదు..కంద‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ భాయ్ జాన్ సినిమాలోనని బాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

 

మ‌రో వైపు నెట్‌ఫ్లిక్స్ వారు రూపొందిస్తోన్న వెబ్ సిరీస్‌లోనూ రానా ద‌గ్గుబాటితో క‌లిసి న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. మ‌రో వైపు సల్మాన్ ఖాన్ కూడా ద‌క్షిణాదిన తన సినిమాల‌ను ఇంజెక్ట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు స్టార్ట్ చేశాడు. ద‌బాంగ్ సినిమాను ద‌క్షిణాది భాష‌ల్లో డ‌బ్ చేసి విడుద‌ల చేసిన స‌ల్మాన్ ఖాన్‌.. ఇప్పుడు రాబోయే చిత్రాల‌ను కూడా ద‌క్షిణాది భాష‌ల్లో డ‌బ్బింగ్ చేసి విడుద‌ల చేస్తాన‌ని తెలిపారు

You might also like

Leave A Reply

Your email address will not be published.