FbTelugu

దారుణం.. ఆడబిడ్డ అని బతికుండగానే పూడ్చేయత్నం!

Poodle-attempt-while-still-alive-as-a-baby

హైదరాబాద్: యాతవ్ సమాజమే సిగ్గుతో తలదించుకునే అమానవీయ ఘటన నగరంలో చోటుచేసుకుంది. ఓ ఆడబిడ్డను బతికిఉండగానే పూడ్చిపెట్టాలని ఓ ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు. వివరాల్లోకెళితే.. ఇద్దరు వ్యక్తులు ఓ బిడ్డను పూడ్చడానికి ప్రయత్నిస్తుండగా గమనించిన ఆటోడ్రైవర్ అనుమానంతో పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని వారిని విచారించగా… తమ మనుమరాలు చనిపోయిందని.. వాహనాల్లో ఎవరూ ఎక్కించుకోలేదని ఇక్కడే పాతిపెడుతున్నట్టు తెలిపారు. కాగా, శిశువు మాత్రం బతికే ఉంది. శ్వాస, కదలికలు స్పష్టంగా కన్పిస్తున్నాయని పోలీసులు తెలిపారు. ఆడబిడ్డ అయినందునే వారు ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు తెలిపారు. శిశువును చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన అఫ్జల్‌గంజ్ పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకొని, విచారిస్తున్నారు.

You might also like