FbTelugu

తెలుగు రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్

హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. ఏపీలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు పోలింగ్‌ మొదలైంది.

ఉభయగోదావరి, కృష్ణా – గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసేందుకు పలువురు క్యూలో నిల్చున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 వరకే పోలింగ్‌ జరగనున్నది. రెండు స్థానాల నుంచి పోటీలో 30 మంది అభ్యర్థులు ఉన్నారు. కృష్ణా – గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది అభ్యర్థులు, ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కృష్ణా జిల్లాలో 51, గుంటూరు జిల్లాలో 60 పోలింగ్‌ కేంద్రాలు. తూర్పు గోదావరి జిల్లాలో 67, పశ్చిమ గోదావరి జిల్లాలో 49 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఈ నెల 17న జరగనున్నది.

మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రులు నియోజకవర్గం ఎమ్మెల్సీ, నల్లగొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రులు నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనున్నది. మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రులు నియోజకవర్గం అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో జంబో బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి 93 మంది పోటీపడుతున్నారు. రెండు నియోజకవర్గాల్లో 1530 పోలింగ్ కేంద్రాలు ఉండగా 15వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.